పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండలంలో ఈరోజు అంబేద్కర్ జయంతి జరుపుకున్నారు
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తిగా ప్రజాప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమం దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు