ఎన్ టి ఆర్ జిల్లా తిరువూరు:- ఎమ్మార్వో కార్యాలయం పేరెత్తి తే చాలు....వామ్మో అంటున్న మండల ప్రజానీకం.
పయనించే సూర్యుడు జనవరి 30 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు:-కరప్షన్ కేరాఫ్ గా ఏమ్మార్వో కార్యాలయం మారిందంటూ సర్వత్రా ఆరోపణలు. ఇక్కడ ప్రతి పనికి ఓ రేటుంటుంది... పైసలిస్తేనే పనవుతుంది... లేదంటే ఆఫీస్ చుట్టూ చెప్పు లరిగేలా తిరగాల్సిందే....చెట్ల క్రింద పడి గాపులు కాయాల్సిందే అని వాపోతున్న రెవిన్యూ భాధితులు. సర్టిఫికెట్స్ కోసం విద్యార్థులు, రెన్యు వల్స్ కోసం వ్యాపారులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, భూములు ఆన్ లైన్ కోసం రైతులు, పొజిషన్ సర్టిఫికెట్ ల కోసం భూ యజమానులు... ఒక్క రేమిటి ఇలా ప్రతి ఒక్కరూ తహసీల్దార్ ఆఫీస్ లో పని అంటే బెంబే లెత్తు తున్న వైనం. ప్రభుత్వాలు ఎన్ని మారినా, రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు పారదర్శక పాలన అందచేయటంలో మాటలు తప్ప చేతలు కాన రాని పరిస్థితి. ఈ దుస్థితి మారేది ఎప్పుడో... జనానికి ఈ రెవిన్యూ తిప్పలు తప్పే దెప్పుడో...?!