( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 25 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ ) కొందుర్గు మండల కేంద్రంలో జరిగిన మూడవ జిల్లా స్థాయి కరాటే మరియు కుంఫు ఛాంపియన్షిప్ పోటీల్లో షాద్నగర్ మాగ్నెట్ స్కూల్ విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. వీరిలో కటాస్ విభాగంలో మెగావాత్ జస్వికా రాథోడ్ మరియు పూజిత మొదటి స్థానం మరియు స్వస్తిక రెండో స్థానంలో గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థులకు మ్యాగ్నెట్ స్కూల్ కరస్పాండెంట్ వాజిద్ పాషా మరియు కరికులం డైరెక్టర్ వినోద్ ప్రిన్సిపాల్ ఆనంద్ మరియు స్కూల్ ఇంచార్జ్ ఆసిఫ్ గెలుపొందిన విద్యార్థులకు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్ మరియు పీరు నాయక్ మాస్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.