భాజపా అభ్యర్థుల గెలుపుతో మిఠాయిల పంపిణీ, ఆనందోత్సాహం
పయనించే సూర్యడు // మార్చ్ // 6 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (భాజపా) అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో మునిగిపోయాయి. ఈ విజయాన్ని పురస్కరించుకొని భాజపా లీగల్ సెల్, కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో ఘనంగా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు, పార్టీ సభ్యులు "తియ్యని పండుగ" పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మిఠాయిల పంపిణీ చేస్తూ విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో భాజపా లీగల్ సెల్ కరీంనగర్ జిల్లా కన్వీనర్ కె. శ్రవణ్ కుమార్, కో కన్వీనర్ కోలిపాక చంద్రమౌళి పాల్గొని, పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఈ ఎన్నికల ఫలితాలు భాజపా బలోపేతానికి దారి చూపాయి. గెలిచిన అభ్యర్థులు ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తారని, భాజపా శ్రేణులు మరింత బలోపేతంగా పని చేసి ప్రజాసేవలో ముందుంటారని పేర్కొన్నారు.విజయోత్సవ సంబరాల్లో భాజపా లీగల్ సెల్ సీనియర్ న్యాయవాదులు , జూనియర్ న్యాయవాదులు, పాల్గొని ఉత్సాహంగా విజయాన్ని పంచుకున్నారు.