పయనించే సూర్యుడు // జనవరి 11// హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
కరీంనగర్ జిల్లా నాటక సమాజాల సమైక్య ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కొలుగూరి దేవయ్యకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుపతి శుభాకాంక్షలు తెలిపారు. హుజూరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి ఆధ్వర్యంలో హుజరాబాద్ పట్టణానికి చెందిన కొలుగూరి దేవయ్య తనదైన శైలిని ప్రదర్శిస్తూ ప్రజలను ఆకర్షింప చేయడంలో దేవయ్య పాత్ర కీలకంగా ఉందన్నారు.నిన్న కరీంనగర్ లో కళాభారతి నందు ఏర్పాటుచేసిన సమావేశంలో దేవయ్యకు కరీంనగర్ జిల్లా నాటక సమాజాల సమైక్య ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం సంతోషం అన్నారు.భవిష్యత్తులో నాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. మాజీ పట్టణ అధ్యక్షుడు కాజీపేట శ్రీనివాస్ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ అధ్యక్షులు ఎండి ఖాళీద్ హుస్సేన్ ,మహాత్మ జ్యోతిరావు పూలే ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్,జ్యోతిరావు పూలే మాజీ అధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య,మట్టెడ ప్రకాష్,మున్ను,జలీల్,అజ్జు,సల్మాన్.తదితరులు పాల్గొని కొలుగోరి దేవయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.