
పయనించే సూర్యుడు నవంబర్ 4,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
కర్నూలు ఉత్సవాలు టీజీవి కళాక్షేత్రం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఏపీ నాటక అకాడమీ సంయుక్త నిర్వహణలో జరుగుతున్నాయి ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లా విశిష్టతను గూర్చి కవితల ప్రదర్శనల కార్యక్రమం ఏర్పాటు చేశారు. కర్నూలు ఉత్సవాల కమిటీ ఆహ్వానం మేరకు నంద్యాల వర్తమాన రచయిత కొప్పుల ప్రసాద్ పాల్గొని "రాయలసీమ ముఖద్వారం కర్నూల్ " అనే కవితను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా ఘనంగా సన్మానం చేశారు.టీ.జీ.వీ .కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య ,కార్యదర్శి యాగంటీశ్వర్ పాల్గొన్నారు .అనంతరం కొప్పుల ప్రసాద్ ను న్యూక్లియస్ కళాశాలల యాజమాన్యం శ్రీ మురళీధర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి సుధాకర్ , తెలుగు పండిట్ అన్నెం శ్రీనివాస రెడ్డి ,కవి నరేంద్ర, కళారాధన కార్యదర్శి డాక్టర్ రవి కృష్ణ, అంతర్జాతీయ శాస్త్రవేత్త రవీంద్రనాథ్ ఉపాధ్యాయుల కవులు కళాకారులు అభినందనలు తెలిపారు.