
పయనించే సూర్యుడు అక్టోబర్ 24 నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం డిజిపి హరీష్ కుమార్ గుప్త రవాణా శాఖ మంత్రితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము. ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏపీ నుంచి ఆరుగురు, తెలంగాణ నుంచి ఆరుగురు, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. ఒడిశా, బీహార్ నుంచి ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్ గ్రేషియా రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నాము. మరొకరిని గుర్తించాల్సి ఉంది. ప్రమాదంలో గాయపడిన 9 మంది ప్రయాణికులకు చికిత్స కొనసాగుతోంది.