
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ధన్యవాదాలు
టాలీవుడ్ సినీనటుడు టార్జాన్
ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన నటుడు టార్జాన్
( పయనించే సూర్యుడు జనవరి 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ నియోజకవర్గ ప్రాంత కళాకారుల ఉన్నతి కోసం కృషి చేస్తూ వారి సౌజన్యం కోసం ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయించడం శుభ పరిణామం టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు టార్జాన్ (లక్ష్మీనారాయణ) అన్నారు. షాద్ నగర్ నూతన ఆడిటోరియం నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే శంకర్ 4.38 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల నటుడు టార్జాన్ ఎమ్మెల్యేను ప్రత్యేకంగా కలుసుకున్నారు. నందిగామ మండలం అప్పారెడ్డి గూడ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో టార్జాన్ ఎమ్మెల్యేను కలుసుకొని శాలువాతో సత్కరించి ఓ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ కృషికి ఆయన కళాకారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కళాకారులను అర్థం చేసుకొని వారి మనోభావాలకు అనుగుణంగా అర్ధంతరంగా ఆగిపోయిన కళాక్షేత్రాన్ని తిరిగి రూపుదిద్దుకునేలా చేసిన కృషి అన్ నిర్వచనం ఏమని అభినందించారు. కళాకారుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే శంకర్ వెంట ఉంటాయని భగవంతుడి దయవల్ల మంచి ఆరోగ్యం సుదీర్ సుపరిపాలన అందే విధంగా ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు స్థానిక జర్నలిస్టు కె.పి, హరీష్ కుమార్ శర్మ తదితరులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా సన్మానించారు. కళాకారులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు..
