
పయనించే సూర్యుడు జులై 16 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి:ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లో ఉన్న రైతు వేదిక వద్ద కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిన కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని 44 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ, కులాలకు చెందిన కుటుంబాలకు ఆడపిల్ల పెండ్లిలకు కానుకగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,16 రూపాయలు చెక్కులు అందించి వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వమని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్ రావు, తాహసిల్దార్ వీరభద్రం, ఎంపీడీఓ మల్లీశ్వరి, ఆర్ ఐ రత్తయ్య,మండల అధ్యక్షులు దేవా నాయక్, నాయకులు ఈది గణేష్, పోశాలు, రెడ్యానాయక్, భద్రు నాయక్,మాజీ సర్పంచ్ బుజ్జి – శివ, ఊళ్ళోజి ఉదయ్,ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్, బండ్ల రజినీ – శ్రీనివాస్, సరిత,బొడ్డు అశోక్, చెన్నయ్య,బానోత్ రవి, తదితరులు పాల్గొన్నారు.