
పెదింటి బిడ్డల పెళ్ళికి కళ్యాణ లక్ష్మీ పేరిటి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుంది-ఎమ్మెల్యే కోరం
ఆర్ధికంగా ప్రభుత్వం లోటులో ఉన్న పేదలందరికి సంక్షేమ ఫలాలు అందించే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది…
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీల వారు కుట్రలు పన్నుతున్నారు
మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలే అండగా నిలువాలి
పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పంపిణీ చేశారు ఇల్లందు పట్టణ మరియు మండలాలకు చెందిన 44 మంది అర్హులైన లబ్ధిదారులకు 44 లక్షల 51 వేల, విలువైన చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుంది అన్నారు. చెక్కు తీసుకున్న లబ్ధిదారులు బ్యాంకుల్లో వేసుకోవాలని సూచించారు.ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, సన్నాలకు బోనస్, రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్న బియ్యం ఇందిరమ్మ ఇల్లులు ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే సంక్షేమ పథకాలు ప్రజల దరి చేరడంలో కాస్త ఆలస్యం అవుతుంది. ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే వారికి ప్రజలు ఆశీస్సులు అందించాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎదలపల్లి అనసూయ, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, ఇల్లందు ఎమ్మార్వో రవికుమార్, ఇల్లందు డిఎస్పి చంద్రబాబు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు మడుగు సాంబమూర్తి, మహిళా కాంగ్రెస్ కమిటీ, పట్టణ మండల అధ్యక్షులు దొడ్డ డానియల్ పట్టణ మండల అధ్యక్షులు దొడ్డ డానియల్, పులి సైదులు, కార్యదర్శులు జాఫర్, ఆర్ఎం కిరణ్, యూత్ కాంగ్రెస్ కమిటీ, తదితరులు పాల్గొన్నారు.