
కార్మిక,కర్షిక,రైతు కుటుంబం విలువలు తెలిసిన వ్యక్తిని-
సర్పంచ్ అభ్యర్థి బానోత్ సదర్ లాల్*
పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 10:
ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు వెళ్తానని వాటిని పూర్తి అయ్యేంతవరకు నిద్రపోనని మండలంలోని అశ్వాపురం గ్రామపంచాయతీని ప్రథమ స్థాయిలో నిలబెట్టే దిశగా పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి సదర్ లాల్ అన్నారు. అదేవిధంగా నేను చేసిన ఉద్యోగంలో కార్మికుల వైపు ఒక ప్రధానమైన యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఇదే అశ్వాపురం గ్రామపంచాయతీకి నా సహచరధర్మచారిణి శారదా లాల్ సర్పంచ్ గా రెండు పర్యాయాలు పని చేసిన సమయంలో ప్రజలతో మమేకమైన విషయం పంచాయతీలో ప్రతి మూలలో ఏ సమస్య ఉన్నదనో ఇట్టే తెలిసే విధంగా ప్రజలలోకి వెళ్లి సమస్యను పరిష్కరించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఆ అనుభవంతోనే సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడుతున్నానని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని నమ్మకం ఉన్నదని అన్నారు. గ్రామపంచాయతీ లోని సమస్యల విషయమై మాట్లాడుతూ పంచాయతీలో అతిపెద్ద సమస్య డ్రైనేజీ సమస్యని వర్షాకాలం వస్తే అశ్వాపురం గ్రామపంచాయతీలో ఆ సమస్య తీవ్రతరం అవుతుందని వర్షపు నీరు ఎటు వెళ్ళాలో తెలియక ఇండ్లలోకి వెళ్ళటం వల్ల ఇండ్లు కూలిపోయిన,మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయని మొట్టమొదటగా డ్రైనేజీ సమస్యను ఎంత ఖర్చైనా పై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.ప్రధాన రహదారి వెంబడి వ్యాపార సముదాయాలలో ఈ సమస్య పెద్దగా ఉన్నదని అది పరిష్కరించే దిశగా అటువైపే మొదటి అడుగు అన్నారు. గ్రామపంచాయతీలో సిమెంట్ రోడ్లు మరొక ప్రత్యేక మని ఎక్కడ మట్టి రోడ్డు ఉండకుండా చేయడమే లక్ష్యమని ప్రతి ఒక్క వీధిలో కరెంటు ఉండే విధంగా వీధి స్తంభాలు, లైట్లు వాటి నిర్వహణ పనితీరు పై ప్రత్యేక దృష్టి పెడతానని అన్నారు. గ్రామపంచాయతీలోని మరొక సమస్య సంత నిర్వహణ సంత దుకాణాలు మండల రెవెన్యూ కార్యాలయం దారిలో ప్రధాన రహదారిపై ఉండటం వల్ల రాకపోకలకు వాహనాలకు ప్రజలకు ఇబ్బంది అని భారజల ఉద్యోగులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఎట్టి పరిస్థితుల్లో సంత నిర్వహణకు ప్రత్యేక స్థలాన్ని ప్రధాన రహదారి వెంబడి కాకుండా ప్రజలకు చేరువలో ఉండే విధంగా చేస్తానని అన్నారు. పంచాయతీలో మరొక అతిపెద్ద సమస్య చెత్త. గ్రామపంచాయతీని పరిశుభ్రతగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తానని ప్రధాన రహదారి వెంబడి కూడలిలో పంచాయతీలోని వీధులలో చెత్త కుండీలు ఏర్పాటు చేసి ఏ వీధిలో కూడా చెత్తను ఉంచకుండా ప్రతి వీధి పరిశుభ్రతగా ఉంచే విధంగా స్వచ్ఛ అశ్వాపురం చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు. పంచాయతీలోని ప్రతి సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తానని చివరగా నన్ను నమ్మి ఓటేసిన ప్రజలకు వారి రుణం తీర్చుకునే విధంగా ఏ సమస్య అయినా కచ్చితంగా పరిష్కరించే దిశగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నాయకులు అశ్వాపురం గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నా యొక్క అనుభవము వయస్సు సర్పంచిగా గెలవడానికి ఉపయోగపడతాయని ప్రతి ఒక్క ఓటరు ఆయనపై నమ్మకం ఉంచి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.