పయనించే సూర్యుడు గాంధారి 11/03/25 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గండిపేట్ లో పదవ తరగతి చదువుతున్న 27 మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య ప్యాడ్లు, పెన్నులను యం ఇ ఓ శ్రీహరి ఆధ్వర్యంలో, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్యక్షతన పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ ప్రతి సబ్జెక్ట్ పై పట్టుదలతో పరీక్షకు సిద్ధం కావాలని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఎదగడానికి పదో తరగతి తొలి మెట్టని వివరించారు. విద్యార్థులే దేశానికి పట్టుకొమ్మలని ఎంఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.