
పయనించే సూర్యుడు 9 జూన్ 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ; బాల్కొండ నియోజకవర్గంలో.. ఏర్గట్ల కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ శివకుమార్ ప్రభుత్వం అందించే ప్రతిఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని,ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ సూచించారు. మంగళవారం రోజున తాడపాకల్, దొంచంద గ్రామాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నూతనం గా మండలపార్టీ అధ్యక్షులు గా ఎన్నికైన ఆయనను గ్రామ కార్యకర్తలు సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా ఎప్పుడో ఒకసారి గుర్తింపు వస్తుందని ఆయన అన్నారు. సమావేశములో కార్యకర్తల అభీష్టం మేర కార్యవర్గం పేర్లు తీసుకొని అధిష్టానానికి పంపి అప్రూవల్ తీసుకున్న తర్వాతే పేర్లు ప్రకటించి ఆర్డర్ కాపీ అందజేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన రానున్న ఎన్నికలే లక్ష్యం గా కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి పార్టీ ని ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. మండల కాంగ్రెస్ కార్యవర్గం మరియు గ్రామ కార్యవర్గం ఎంపిక గురించి గ్రామ కార్యకర్తలు అందరిసమక్షంలో చర్చించారు. ప్రజా పాలనా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లే బాధ్యత మనందరిది అని,పార్టీ ఆదేశానుసరం పార్టీ కోసం అందరూ పనిచేయాలని, పార్టీకోసం కష్టపడ్డా ప్రతీ కార్యకర్తను పార్టీ గుర్తిస్తుంది అనీ తెలిపారు. ఈ కార్యక్రమం లో పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సోమ దేవారెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కౌడ పెద్ద బూమేశ్వర్ , మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దానం గంగా మోహన్, నాయకులు ,తడ్ పాకల్ , గుమ్మిర్యాల్ గ్రామాసర్పంచ్లు అనిల్, దేశవోయిన సంజీవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగారెడ్డి, బద్దం లింగారెడ్డి, హన్మంత్ రెడ్డి, దాసరి సాయన్న, బాలే శ్రీనివాస్, సున్నపు శ్రీనివాస్, పెద్దిరెడ్డి లింగారెడ్డి, లోలపు రాజు, తొర్తి శేఖర్ , గోలి కైలాష్, బట్టాపూర్ నందు, ఇప్ప మల్లారెడ్డి, తడుపాకల్ శ్రీనివాస్ యాదవ్, ఎస్కే.అశ్వక్ , రాజాగౌడ్, జప్పఆర్ , దాసరి అశోక్, అంబటి రాజేశ్వర్, ఇప్ప రాజేందర్, మునిమాణిక్యం అజయ్, ఎస్కే సలీం, గ్రామాల కార్యకర్తలు, నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.