పయనించే సూర్యడు //ఫిబ్రవరి // 20 //హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలుపు కోసం గురువారం కమలాపూర్ మండల కేంద్రంలో, కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి,రవీందర్, విశ్రుత ప్రచారం చేయడం జరిగింది.కరీంనగర్,అదిలాబాద్,నిజామాబాద్,మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కట్కూరి నరేందర్ రెడ్డి, గెలుపు కోసం కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పట్టభద్రుల ఓటర్ల ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇట్టి ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడక శ్రీకాంత్, విష్ణుదాసు వంశీధరావు, శనిగరపు రమేష్, పుల్ల సునీల్, వైనాల సుభాష్, మాట్ల రాజేష్, శనిగరపు దినేష్, పుల్ల సుభాష్ తదితరులు పాల్గొన్నారు.