పయనించే సూర్యడు // ఫిబ్రవరి // 25 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. నిరుద్యోగులకు అండగా నిలిచింది… కేవలం కాంగ్రెస్ పార్టీయేనని… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని గ్రాడ్యుయేట్స్ ను కోరారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మరింత అభివృద్ది పథంలోకి తీసుకుపోనుందని తెలిపారు. కరీంనగరంలోని ఎస్సారార్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎంకు పలువురు మంత్రులు ఘనస్వాగతం పలికారు. సీఎంకు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి జ్ఞాపిక అందజేశారు. పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు శాలువాలతో సత్కరించారు. ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ కరీంనగర్ అని, సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.కేసీఆర్ మీ అభ్యర్థి ఎవరో ప్రకటించండంటూ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత లు స్వయంగా మీ ఓట్లు ఎవరికి వేయదలుచుకున్నారని అడిగారు. ఎమ్మెల్సీ బరిలో దింపేందుకు అభ్యర్థి దొరకలేదా, అని కేసీఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదిరిందని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్ కంకణం కట్టుకుందన్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ దేనని స్పష్టం చేశారు. డీఎస్సీ, టెట్ పెట్టకుండా బీఆర్ఎశ్ నిర్లక్ష్యం చేసిందని.. 11వేల మంది టీచర్ల నియామకం చేశామన్నారు. ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు అందించింది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. మట్టిలో మానిక్యాలను వెలికి తీయాలనే సంకల్పంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. రాబోయే ఒలంపిక్స్ లో తెలంగాణా నుండి భారీగా పథకాలు రాబోతున్నాయని చెప్పారు. ఈ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రాను నెలకొల్పామని గుర్తుచేశారు. విప్లవాత్మకమైన మార్పులతో తెలంగాణాను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు కాంగ్రెస్ పట్టం కడుతోందని తెలిపారు. 27వ తేదీన జరుగబోయే ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని.. మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆనాడు ప్రశ్నించే గొంతు అవసరమయ్యిందని… ఈనాడు ప్రజాస్వామ్య పాలనలో నరేందర్ రెడ్డి గెలుపు అవసరమని చెప్పారు. 317 జీవో పై రాష్ట్ర ప్రభుత్వ స్పష్టంగా ఉందని తెలిపారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.