
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్లో కీలక నియామకాలు జరిగాయి. జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీగా కాల్వ రఘు, నర్సాపూర్ (జి) మండల ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడిగా గడ్డం అశోక్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు కట్ట శ్యాంప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ తూర్పాటి వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి కొంతం గణేష్ చేతుల మీదుగా నూతనంగా నియమితులైన నాయకులకు నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కాల్వ రఘు, గడ్డం అశోక్ తమపై పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతనంగా నియమితులైన నాయకులను అభినందించారు.