
.పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్లా
బాల్కొండ నియోజకవర్గం లో కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన వినీల - ప్రదీప్ ఈరోజు సోమవారం రోజున బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కమ్మర్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ముత్యాల సునీల్ కుమార్ వినీల- ప్రదీప్ ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కమ్మర్ పల్లి మండల అధ్యక్షుడు సుంకేటరవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
