పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పోనకంటి ఉపేందర్ రావు : ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండల బేతపూడి సొసైటీ అధ్యక్షుడు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు లక్కినేని సురేందర్ గారి అరెస్టు పూర్తిగా అక్రమం అనైతికమని కాంగ్రెస్ పార్టీ పాలనలో కేసుల పరంపర నడుస్తుందని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు. రేగ కాంతారావు. మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ లు దుయ్యబట్టారు. విత్తనాల విషయంలో జరిగిన వివాదంలో రైతులు ఎటువంటి కేసులు కోరుకోకుండా కేవలం తమకు నష్టపరిహారాన్ని చెల్లిస్తే చాలు అని చెబుతున్నా కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగా లక్కినేని సురేందర్ ని కేసులో ఇరికించి వారిని రిమాండ్ కు తరలించి రాక్షసానందాన్ని పొందుతున్నారని కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజా సంక్షేమాన్ని వదిలి కేవలం పోలీస్ స్టేషన్ ల చుట్టూ పోలీసుల అధికారుల చుట్టూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు.పోలీస్ పహారాలో నియోజకవర్గంలో పరిపాలన సాగుతుందని ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రతిపక్ష హోదాలో ప్రశ్నించిన మా సోషల్ మీడియా నాయకులను కూడా స్టేషన్ కి పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పరిపాలన చేతకాక మన ముఖం సరిగా లేక అర్థం నేలకు వేసుకొని కొట్టాడంట ఒకడు అనే సామెత లాగా నేడు నియోజకవర్గ పరిపాలన ఉందని ఎద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలోతెలంగాణ ఉద్యమ సీనియర్ జిల్లా నాయకులు సిలివెరి సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ,ఎస్ రంగనాథ్, ఇల్లందు మండల అధ్యక్షుడు శీలం రమేష్ టేకులపల్లి మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్, ఇల్లందు మండల ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీర భావు సింగ్ నాయక్, ఇల్లందు ఏరియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జాఫర్ హుస్సేన్, ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, టేకులపల్లి మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్. తదితరులు పాల్గొన్నారు.