-రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, డీ.సీ.ఏం ఎస్ చైర్మన్ కొత్వాల
పయనించే సూర్యుడు జనవరి18( పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి) పాల్వంచ రూరల్:... తెలంగాణా రాష్ట్ర ప్రజల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, డీ.సీ.ఏం.ఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శని వారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పరిధిలోని బసవతారకం కాలనీలో అధికారులు చేపడుతున్న ఇందిరమ్మ ఇంటింటి సర్వే ప్రక్రియను కొత్వాల పరిశీలించారు.
ఈ సందర్భం గా కొత్వాల మాట్లాడుతూ అధికారులు చేపట్టే ఇంటింటి సర్వే లో ఇందిరమ్మ గృహాలు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఉపాధి హామీ లబ్దిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వంటి పథకాల పై అధికారులు సర్వే జరుపుతున్నారని, అధికారులకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహకరించాలని కొత్వాల అన్నారు. ఈ నెల 21 వ తేది నుండి ఆయా పంచాయతీ పరిధిలోని పంచాయతీ కార్యాలయాల్లో గ్రామా సభలు నిర్వహించి, లబ్దిదారులను ఎంపిక చేస్తారన్నారు. ఈ నెల 26 వ తేదీ నుండి గుర్తించిన అర్హులైన ప్రజలకు, లబ్దిదారులకు మంజూరు పత్రాలు అంద జేస్తారన్నారు. సర్వే ప్రక్రియలో కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు, సర్వే అధికారులకు సహకరించి తమ వంతు సహకారం అందించాలని కొత్వాల అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టో లో తెలిపిన ఆరు గ్యారంటీ లలో రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణి, ఇందిరమ్మ గృహాలు మంజూరు వంటి పధకాలను నెర వేరుస్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు నిలవాలని కొత్వాల కోరారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ జి వివేక్, మండల అభివృద్ధి అధికారి కె విజయభాస్కర్ రెడ్డి, ఏపీ ఎం ఎన్ రాంబాబు, పంచాయతీ కార్యదర్శి అజ్మీరా రాంబాబు, వెలుగు సిసి జి పద్మ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, కాపర్తి వెంకటా చారి, గంధం నర్సింహారావు, పులి సత్యనారాయణ, రాపోలు ఆనంద్, దారా జాన్, ప్రేమ్ కుమార్, అజిత్, శ్రీనివాసరెడ్డి, వందరోజుల శ్రీను, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.