
బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ.
..రుద్రూర్, అక్టోబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసపూరిత మాట్లాలతో మభ్యపెడుతుందని రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ అన్నారు. గురువారం బిజెపి పార్టీ కార్యాలయం వద్ద సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను కావాలని ప్రభుత్వం వాయిదా వేసిందని అన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇలా ఎన్నికలను వాయిదా వేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలా జరగడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మించి మభ్యపెడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రుద్రూర్ మండలం అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరు ప్రశాంత్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు పార్వతి మురళి,మరియు చీదురా మహిపాల్ గారు ప్రధాన కార్యదర్శి ఏములగజేందర్, ఉపాధ్యక్షులు బోజిగొండ అనిల్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఓదెల సతీష్ పవర్, కురుమే బాబురావు పాల్గొనడం జరిగింది.