పయనం చే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా లో
ఈ రోజు 79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు చోట్ల జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.కాంగ్రెస్ భవన్,రైల్వే స్టేషన్ వద్ద రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,గాంధీ చౌక్ నెహ్రూ పార్క్ వద్ద నూడ చైర్మన్ కేశ వేణు జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్య పోరాటం అవుసులు బాసిన అమరవీరులందరికీ నివాళులు అర్పించారు.దేశ స్వాతంత్ర్యం లో తమ ప్రాణాలు అర్పించి మనకు స్వచను అందించిన అమరవీరుల ఆలోచనలు,ఆశయాలను అందరూ ముందుకు తీసుకువెళ్తూ దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రస్తుతం కొందరు దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతిస్తూ,దేశాన్ని మతాల వారిగా విభజించే ప్రయత్నాన్ని అందరం తిప్పికొట్టాలని ఆయన అన్నారు. మరొక్క సారి జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నుడ చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ దేశ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని ఎందరో మహనీయులు తమ ప్రాణాలను అర్పించి స్వాతంత్ర్యం తెచ్చారని,వారి త్యాగాలకు అర్థం ఉండే విధంగా మనమందరం మత కుల బేధాలు లేకుండా కలిసి దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లాలని అన్నారు.ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ జిల్లా మరియు నగర ప్రజలకు 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్,రామార్తి గోపి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,జిల్లా ఓ బి సి అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా ఎస్ టి సెల్ అధ్యక్షులు యాదగిరి,జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్,మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ జావీద్ అక్రమ్,మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షులు మఠం రేవతి, ఈసా,వినయ్,పోల ఉష,గాజుల సుజాత,మలైకా బేగం,అపర్ణ, బొబ్బిలి రామకృష్ణ,కేశ మహేశ్ మరియు తదితరులు పాల్గొన్నారు