
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
ఈరోజు 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు నగేష్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.అదేవిధంగా గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ వద్ద కూడా జెండా ఆవిష్కరించడం జరిగింది.నెహ్రూ పార్క్ చౌరస్తా వద్ద నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగం, పోరాటం వల్ల దేశానికి 1947 వ సంవత్సరంలో స్వాతంత్రం రావడం జరిగిందని, అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారని, స్వాతంత్ర అనంతరం దేశాన్ని ఏ విధంగా పరిపాలన కొనసాగించాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించాలని జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా సుదీర్ఘ ఆలోచన జరిపి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చోటు కల్పించి, వారు వివిధ దేశాల రాజ్యాంగాలన్నింటినీ పరిశీలించిన తర్వాత దేశానికి అమూల్యమైన రాజ్యాంగాన్ని అందించడం జరిగిందని, ఈ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చిందని తద్వారా దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగుతుందని ఆయన అన్నారు. రాజ్యాంగం నిర్మాణం కోసం ఎందరో మహనీయులు కృషి చేస్తే ఇప్పుడు దేశంలో ఉన్న బిజెపి నాయకులు రాజ్యాంగాన్ని కించపరుస్తూ రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఉన్నారని, దేశ ప్రజల హక్కులను కాలరాసే విధంగా చేస్తున్నారని, దీనిని ఎక్కడికక్కడ దేశ ప్రజలు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని ముగించుకొని 77వ గణతంత్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు నగేష్ రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, నూడ చైర్మన్ కేశ వేణు,పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్,పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్,రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు జావీద్ అక్రమ్,మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి,జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్,జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు లింగం,రాష్ట్ర ఎస్ యు ఐ వేణు రాజ్,జిల్లా ఫిషర్శిష్ చైర్మన్ శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు మాజీ మీసాల సుధాకర్ రావు,నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి,నగర ST సెల్ అధ్యక్షుడు సుభాష్ జాదవ్,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్,మార్కెట్ కమిటీ సభ్యులు ఈసా,మహిళా కాంగ్రెస్ నాయకులు చంద్రకళ,పోల ఉష,మలైకా బేగం,గాజుల సుజాత,విజయ లక్ష్మీ,స్వప్న,మీనా,విజయ, అవిన్,నరేంద్ర సింగ్,రాజ్ గగన్,బంటు బలరాం,రాజేంద్ర ప్రసాద్,మాజీ సర్పంచ్ గణేష్,సంగెం సాయిలు,రబ్బానీ,కొండపాక రాజేష్,పుప్పాల శంకర్,కైషర్ మరియు తదితరులు
