పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ఈ రోజు ఏర్గట్ల పట్టణానికి చెందిన ఇద్దరు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు, మాజీ పట్టణ అధ్యక్షులు రాజారాం కుమ్మరి సహదేవ్, ఇబ్రైంపట్నం చిన్న భూమన్న బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుట జరిగింది. వీరి ఇద్దరిని కాంగ్రెస్ కుటుంబంలోకి సునీల్ కాంగ్రెస్ కండువా వేసి ఆహ్వానం పలికారు. రాజారాం సహదేవ్, ఇబ్రహీంపట్నం చిన్న భూమన్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి తోడ్పడ్డామని, మా ప్రాంతములో ఎవరు పార్టీ జెండా పట్టనినాడు ఇక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు తీసుకవెళ్లి అధికారము లేని నాడు ప్రతిపక్షములో ఎవరు లేని నాడు పార్టీ కోసం సేవ చేసిన్నాము. ఇప్పుడు సీఎం రేవంతన్న ప్రజాపాలన బాగుంది ప్రజా సంక్షేమ పథకాలు పేద మధ్య తరగతి కుటుంబాలకు అందుతున్నాయని మాకు నచ్చి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని ఇప్పటి నుండి కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేస్తామని సీఎం రేవంతన్న నాయకత్వాన్ని బలపర్చే విధముగా యుంటామని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమములో టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణు యాదవ్ , కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చెర్మెన్ పాలేపు నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ దేవారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి, ముస్కు మోహన్, బద్దం లింగారెడ్డి, ఓర్సు రాములు, పన్నాల నర్సారెడ్డి, దండేవోయిన సాయన్న, దండెవోయిన ఆశన్న, ఏనుగంటి నర్సయ్య, దండేవోయిన సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు