పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ ; అశ్వారావుపేట ఉద్యోగ కార్మికుల సమస్యల కోసం పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ అనునిత్యం శ్రామిక వర్గం ప్రయోజనాల కోసమే సిఐ టియు పని చేస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. వ్యవసాయ కళాశాల కాంట్రాక్ట్ కార్మికులు 30 మంది సిఐటియు లు బుధవారం చేరారు. శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అర్జున్ మాట్లాడుతూ పాలక ప్రభుత్వం ఏదైనా కార్మిక ఉద్యోగుల హక్కులను మరిచి పరిపాలన నిర్వహిస్తున్నారని పెరుగుతున్న ధరలతో పెరగని వేతనాలతో భద్రత లేని ఉద్యోగాలతో కార్మికులు సతమతం అవుతున్నారని అన్నారు. ఏ రంగంలో పనిచేస్తున్న కార్మికులైన వారందరినీ సమైక్యపరిచి కార్మికుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా భూపతి శ్రీనివాసరావు పి నాగమణి కోశాధికారిగా ఖరీమాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎంప్లాయిస్ వర్కర్ యూనియన్ రాష్ట్ర నాయకులు సాలార్, రత్నం సత్యవతి సీత సలీమా తదితరులు పాల్గొన్నారు.