పయనించే సూర్యుడు న్యూస్ (ఫిబ్రవరి.08/03/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కాంబాకం సర్పంచ్ దీప నరేంద్ర ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా సీనియర్ సిటిజెన్ పంజవర్ణం,గంపా సుబ్బమ్మ,గ్రీన్ అంబాసిడర్ అమ్ములు, లను సర్పంచ్ దీప నరేంద్ర శాలువాతో సత్కరించి,మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ మహిళలు ఆనంద పట్టమ్మ,అరణి నాగేశ్వరి,బొగ్గల సబిత,బేబీ మోక్షిత లు,సర్పంచ్ దీప నరేంద్రను సత్కరించారు.కాంబాక్కం మొట్టమొదటి మహిళా సర్పంచ్ గా ఎన్నిక అయిన దీప నరేంద్ర ను అభినందనలు,శుభాకాంక్షలు తెలిపారు.మహిళా దినోత్సవం కార్యక్రమాలను దూరదర్శిని ద్వారా చూస్తున్నామని,ప్రత్యేకముగా మహిళల కోసం చేపడుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన పెంచుకోవాలని మహిళలు అన్నారు.