

పయ నించే సూర్యుడు జూలై 29 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)కాట్రేనికోనలో పంచాయతీ సిబ్బందితో ఎంపీడీఓ సమీక్షకాట్రేనికోన :మండల పరిషత్ కార్యాలయం కాట్రేనికోన నందు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, హరిత రాయబారులతో ఎంపీడీఓ బి రాజేశ్వర రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య సేవలందిస్తున్న హరిత రాయబారులను అభినందించారు.కార్యదర్శులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఘన, ద్రవ వ్యర్ధాలను వేరు చేసే విధంగా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని హితవు పలికారు.ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రతీ ఒక్కరూ బాధ్యత వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ సమీక్షలో డిప్యూటీ ఎంపీడీఓ ఎస్ సూర్య నారాయణ రాజు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, హరిత రాయబారులు పాల్గొన్నారు.