
ప యనించే సూర్యుడు ఆగస్టు 5 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల భారతీయ జనతా పార్టీ మండల సమావేశం ఈరోజు మండల అధ్యక్షులు మట్ట శివకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించారు. పార్టీ విధానాలను గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ సూచించారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి కొత్తలంక సురేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు మట్ట సూరిబాబు, సుంకర నాగేశ్వరావు, కట్టా కనకదుర్గ, నాగలక్ష్మి, నాగమణి, సూర్యలక్ష్మి, పట్టాభి, నంద్యాల తాతాజీ తదితరులు పాల్గొన్నారు