
పయ నించే సూర్యుడు ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమంలో కాట్రేనికోన మండలం పల్లం గ్రామ పంచాయతీ, స్వర్ణ గ్రామంలో ఆరోగ్య సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న సాయికుమార్ ఉత్తమ ఉద్యోగి పురస్కారం అందుకున్నారు.జిల్లా కలెక్టర్ మరియు మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ఆయనకు ప్రశంసా పత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య సేవల్లో చూపిన చిత్తశుద్ధి, నిబద్ధతకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.ప్రతి ఇంటికి వెళ్లి సేవలు అందించడంలో, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆయన కృషి ప్రశంసనీయమని అధికారులు కొనియాడారు.ఈ అవార్డు ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.కాట్రేనికోనఎంపీడీఓ బి రాజేశ్వరరావు కాట్రేనికోన మండల సచివాలయం సిబ్బంది అందరికీ అందరికీ కాట్రేనికోన తరఫున సాయికుమార్ కు హార్ధిక అభినందనలు తెలియజేశారు.