

పయ నించే సూర్యుడు ఆగస్ట్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, వేట్లపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలోని ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్లను ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు పరిశీలించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థుల అభ్యాసనా సామర్ధ్యాలను పరిశీలించారు. అంకితభావంతో విద్యనభ్యశించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని హితవు పలికారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులతో మాట్లాడి భోజనం నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం కందికుప్ప, లక్ష్మివాడ గ్రామ పంచాయతీలోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు.పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, తరగతి గదుల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. అంగన్వాడీలో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, టీకాల వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. పోలింగ్ స్టేషన్లలో తాగునీరు, విద్యుత్, ర్యాంప్ వంటి కనీస సదుపాయాలు ఉండేలా చూడాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు.సందర్శనలో డిప్యూటీ ఎంపీడీఓలు ఎన్ శంకర్ నారాయణ, ఎస్ సూర్య నారాయణ రాజు, పంచాయతీ కార్యదర్శి జె వి సత్యన్నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.