పయనించేసూర్యుడు,జనవరి 17,కాప్రా ప్రతినిధి సింగం రాజు:కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ ఆదేశాల మేరకు స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షన్ 2024,శుక్రవారం కాప్రా డివిజన్,సి.ఎస్.నగర్,మల్లికార్జున్ నగర్,శివ సాయి నగర్ కాలనీలో,శానిటేషన్ విభాగము సిబ్బంది,ప్రత్యేక వాహనంతో త్రిబుల్ ఆర్.వస్తువుల సేకరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వస్తువులు,పాత పుస్తకాలు,బట్టలు,పాత సైకిళ్ళు,ప్లాస్టిక్ బాటిల్స్,సేకరించడం జరిగింది.కాప్రా డివిజన్ సి ఎస్ ఆర్ నగర్,శివ సాయి నగర్ కాలనీ అసోసియేషన్ వారు పాల్గొని వీధి వీధి తిరిగి అవగాహన కల్పిస్తూ వస్తువులనుసేకరించారు.ఆర్.ఆర్.ఆర్ కు సంబంధించిన మెటీరియల్ అనగా పాత పుస్తకాలు,ప్లాస్టిక్ బాటిల్స్,పాత సైకిళ్లు,కూలర్,స్వెటర్స్,వివిధ రకరకాల వస్తువులను సేకరించి కాప్రా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ సాకేత్ యందు ఏర్పాటుచేసిన త్రిబుల్ ఆర్ సెంటర్ కు చేరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలోసిఎస్ నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూజ,అసోసియేషన్ సభ్యులు శివ సాయినగర్ జగదీష్,మల్లికార్జున్ నగర్ కు సంబంధించిన అసోసియేషన్ సభ్యులుకూడాకార్యక్రమంలోపాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ సానిటరీ జవాన్ కృష్ణ,అశోక్ ఇంచార్జ్ ఎస్ఎఫ్ఏ అంజలి ఎస్ఎఫ్ఏ అరవింద్,సునీల్ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.