పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 16
కాఫీ రైతులకు న్యాయం జరగకపోతే న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ ఛైర్మన్ మొట్టడం రాజబాబు పిలుపునిచ్చారు.జాతీయ రహదారి 516ఇ నిర్మాణంలో పెదవలస పంచాయతీ పరిధిలోని రంపుల,చాపరాతిపాలెం,పెదవలస గ్రామాలలో రైతుల కాఫీ తోటలకు నష్ట పరిహారాన్ని చెల్లించకుండానే పనులు మొదలు పెట్టడంతో కాఫీ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ గత 11 రోజుల నుండి పెదవలసలో దేవరాపల్లి జంక్షన్ వద్ద దీక్ష చేస్తున్న విషయం విదితమే.కాఫీ రైతులు చేపట్టిన దీక్ష వద్ద రాజబాబు మాట్లాడుతూ భారత్ ఆదివాసీపార్టీ,ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి తరుపున సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నామని, కాఫీ రైతులు ప్రజా పోరాటామే కాకుండా న్యాయ పోరాటానికి కూడా సిద్ధం కావాలని,రైతుల కాఫీ తోటలను ప్రభుత్వం ఏపీఎఫ్ డిసీ ద్వారా సర్వే జరిపించి నష్ట పరిహారాన్ని అంచనా వేసి,ఆ అంచనాలు ప్రకారం కాకుండా దాని కంటే తక్కువ నష్ట పరిహారం ఇవ్వడానికి అధికారులు,జాతీయ రహదారి నిర్మాణపు పనుల గుత్తేదారులు పూనుకోవడం దారుణమైన చర్య అని,ఎపీఎఫ్ డీసీ చూసించిన నష్టపరిహారానికి ప్రభుత్వం ఇస్తామంటున్న నష్ట పరిహారానికి లక్షలలో తేడా ఉందని,ఉదాహరణకు ఒక రైతుకు ఏపీఎఫ్ డీసీ 19,55,026రూపాయలు ఇవ్వాలని చూసిస్తే అదే రైతుకు ప్రభుత్వ మాత్రం 2,40,724 రూపాయలు ఇస్తామని చెప్పడం ఎంత దారుణమని,కాఫీ రైతులు ఆదివాసీలు కాబట్టే ప్రభుత్వం ఇలాంటి మోసం చేస్తుందని,ఇదే రహాదారికి షెడ్యూల్డ్ ప్రాంతంలో నష్టపరిహారానికి,నాన్ షెడ్యూల్ ప్రాంతంలో గల నష్ట పరిహారానికి కూడా చాలా వ్యత్యాసం ఉందని,ఆదివాసీలంటే ప్రభుత్వానికి ఎందుకు అంతా చులకనో అర్థం కావడం లేదని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను అందలం ఎక్కిస్తున్నామని ప్రచారం మాత్రం చేసుకొంటున్నాయి కానీ వాస్తవానికి ఇలాంటి దగాకోరు పనులు చేస్తూంటే ఊరుకోవడానికి వీలు లేదని,ఖచ్చితంగా న్యాయ స్థానాలను ఆశ్రయించాల్సిందేనని,జాతీయ రహదారి నిర్మాణంలో పీసా చట్టం ప్రకారం గ్రామ సభ ఆమోదం పొందలేదని,అలాగే భూబదాలయింపు నిషేధ చట్టాన్ని కూడా ఉల్లంఘించారని,ఆఖరికి ఈ రహదారి నిర్మాణం వల్ల ఆదివాసీ సమాజానికి ఒరిగేది ఏమి ఉండదని,ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను తీసుకుని పోవడానికి అభివృద్ధి పేరుతో ప్రభుత్వమే దోపిడీకి పాల్పడడం దారుణమైన చర్య అని దుయ్యబడుతూ,రహాదారి నిర్మాణంలో నష్టపోతున్న రైతులకు న్యాయ చేయకపోతే రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో భారత్ ఆదివాసీపార్టీ ఎంపీ రాజ్ కుమార్ రోత్ (రాజస్థాన్) తో పార్లమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తామని,రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని అధికారులు,గుత్తేదారులు అప్పనంగా మింగేస్తామంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కంకిపాటి శరభన్నపడాల్, కంకిపాటి శ్రీనివాస్, కంకిపాటి మోహన్ గాంధీ,లమ్మసింగి రమేష్, గడుతూరి వెంకటరమణ, రాట కన్నబాబు,జోరంగి దేవుడు,గడుతూరి రత్నాలమ్మ,,గడుతూరి వెంకటలక్ష్మీ,పాంగి మల్లేశ్వరి, మర్రి మంగరాజులతో పాటు కాఫీ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.