రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే రేషన్ బియ్యం పంపిణీ చేయాలి..
సన్న బియ్యం పేరుతో ఫోటోలకు ఫోజులు తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతకాని కాంగ్రెస్ సర్కార్..
టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు అఖిల్ గౌడ్..
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 4 // హుజురాబాద్ // కుమార్ యాదవ్..
హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రం లో నిర్వహించిన సమావేశం లో రాష్ట్ర నాయకులు రాపర్తి అఖిల్ గౌడ్ మాట్లాడుతూ..ఇంతవరకు కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేని చేతకానికి కాంగ్రెస్ ప్రభుత్వం, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు.మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు బియ్యం ఎట్లా ఇస్తారు?.అని ప్రశ్నించ్చారు. ప్రజాపాలనని నాలుగు సార్లు ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టి కాగితాల మీద సంతకాలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, పింఛన్ ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒకటి కూడా నెరవేర్చని చేతగాని ప్రభుత్వం అని మండిపడ్డారు.
ఆరు గ్యారెంటీలలో ( అర )గ్యారంటీ కూడా అమలు చేయలేదు. అన్నారు. 420 హామీలను గాలికి వదిలేసి కేవలం ఫోటోలకు ఫోజులిస్తూ మేము సన్న బియ్యం వేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. మార్చి 31 లోపు రైతు భరోసా మొత్తం ఎస్తా అని మాట తప్పిన రేవంత్ రెడ్డి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ 2 లక్షల లోపు వచ్చిన, 100 రోజులనే చేస్తానని రైతుల నెత్తిమీద గుండు సున్నా పెట్టిన మోసకారి.అని అన్నారు.ఇప్పటికే రాష్ట్రంలో 450 పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంట ఉంటే ఒక్క రైతు కుటుంబాన్ని కూడా రేవంత్ సర్కార్ పలకరించే పరిస్థితి లేకపోవడం దుర్మార్గం అని అన్నారు. తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు రాము విజయ్, అనిల్, అరవింద్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.