
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 5(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల లాగే శ్రీ.రమా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో 21 దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో రావడం జరిగింది తీర్థప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది ఆలాగే సాయంత్రం సహస దీపాలంకరణ పల్లకి సేవ కార్తీక లక్ష దీపోత్సవం నిర్వహించి భక్తులకు వెన్నెల భోజనం ఏర్పాటు చేస్తున్నామని ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఆర్యవైశ్య మహిళా సంఘ సభ్యులు తెలపడం జరిగింది.

