హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్
పయనించే సూర్యుడు జనవరి 13 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్
వడ్డేపల్లి ఇంటి వద్ద సోమవారం రోజున బిఆర్ఎస్ పార్టీ బీమా చెక్కును కార్యకర్త కుటుంబానికి అందజేత
కార్యకర్తలను, వారి కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ ములకలపల్లి కుమారస్వామి ఇటీవల మరణించారు. కాగా పార్టీ సభ్యత్వ బీమా చెక్కు రెండు లక్షలు రాగా.దాస్యం వినయ్ భాస్కర్ వడ్డేపల్లి ఇంటి వద్ద సోమవారం రోజున చెక్కును బాధిత కుటుంబసభ్యులు (కుమారస్వామి భార్య సవితకు అందజేశారు.పార్టీ కార్యకర్తలకు,వారి కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు.పార్టీకి బలం కార్యకర్తలే అని,పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకొని ఉన్న వారికి మంచి రోజులు వస్తామని అన్నారు. పార్టీ కార్యకర్తల కష్టసుఖాలు తెలిసే ప్రమాద బీమా సౌకర్యాన్ని ఉచితంగా కల్పించిందని వివరించారు.ఈ కార్యక్రమంలో హసన్ పర్తి మండల అధ్యక్షుడు బండి రజని కుమార్,బైరాన్‌పల్లి గ్రామ మాజీ సర్పంచ్ కుందూరు సాంబ రెడ్డి,పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బైరి మధుకర్ రెడ్డి , పీఏసీఎస్ మల్లారెడ్డి పల్లె సొసైటీ వైస్ చైర్మన్ ములకలపల్లి జయశంకర్, గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు గోగుల శ్రీనివాస్, టీఆర్ఎస్వీ నాయకులు జట్టి రాజేందర్, నాయకులు పిడుగు రాజేందర్, యాదగిరి, శివకుమార్, యాకుబ్ పాషా,తదితరులు పాల్గొన్నారు.