పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 8. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు
కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో పడకేసిన పారిశుద్ధ్యం పనులని భారతీయ గోర్ బంజారా పోరాట సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గ ప్రసాద్ అన్నారు టాక్టర్ నడపక చెత్త సేకరించక ఎవరు ఇంటివద్ద చూసిన డంపింగ్ యార్డ్ ను తలపిస్తూ చెత్త దర్శనమిస్తుంది సైడ్ కాలవలు నిండి ఎక్కడకక్కడకు మురికి నీరు నిలిచి దుర్వాసన దోమలతో ఇబ్బంది పడుతున్నారు పంచాయతీ ప్రజలు అని ఆయన అన్నారు సంబంధిత మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారు కూడా నిర్లక్ష్యం వహిస్తూ పనులు చేయించనటువంటి పరిస్థితి కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో కనపడుతుంది అదేవిధంగా మిషన్ భగీరథ నీరు రాక బోరింగులు పనిచేయక నీటి కొరతతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామపంచాయతీ ప్రజలు అని ఆయన అన్నారు 1200 పైచిలుకు ఓటర్స్ ఉన్న గ్రామపంచాయతీ లో పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది వారు ఎన్ని నెలల నుంచి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి లో గ్రామ ప్రజలు ఉన్నారని ఆయన తెలియజేశారు ఎవరి వద్ద విన్న ఒకటే మాట పారిశుద్ధ కార్మికులు ఎవరు రావట్లేదు మా సైడ్ కాలవలు క్లీన్ చేయట్లేదు చెత్తను తీసుకువెళ్లట్లేదు అనే మాటే తప్ప వస్తున్నారు పనిచేస్తున్నారని మాట వినపడనటువంటి పరిస్థితి కావున తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని జనాభా ప్రకారంగా పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది అవసరమో అంతమందిని నియమించి గ్రామపంచాయతీ ప్రజలు ఎటువంటి అనారోగ్య బారిన పడకుండా తాగునీటి సమస్యలు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు లేనిపక్షంలో ఈ విషయాలన్నిటినీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే లాగా కోరతానని ఆయన తెలియజేశారు