
తపస్ జిల్లా శాఖ డిమాండ్
{ పయనించే సూర్యుడు} {ఫిబ్రవరి 27మక్తల్}
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల్లో హేతుబద్దీకరణ చెయ్యాలని ఆలోచించినందున వెంటనే అందుకు అనుగుణంగా కాలం చెల్లిన జీవో :25 ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించి కొత్త జీవో విడుదల చేయాలని తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహ రవీందర్ డిమాండ్ చేశారు.
ప్రతి పాఠశాలలో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడినీ కేటాయించాలని, ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాలి అనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా 1:19 ఇద్దరూ ఉపాధ్యాయులు ఉండాలనీ"పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకు ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూస్తేనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని"పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు దీర్ఘకాల సెలవులు పెట్టిన సందర్భంలో వారి స్థానంలో అర్హత గల వారిని ప్రత్యేక వాలంటీర్లుగా నియమించాలని దీనివల్ల విద్య బోధనకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉంటుందని తెలిపారు.ప్రాథమికోన్నత పాఠశాలల్లో కచ్చితంగా పిఈటిలను నియమించాలని పెండింగ్ లో ఉన్న పిఆర్సి
డి. ఏ లను త్వరగా ప్రకటించాలని కోరారు