
పయనించే సూర్యుడు 23 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొడతం బాల్కొండ నియోజకవర్గ BRS నాయకులు
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు హరీష్ రావు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.వేల్పూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగంపేట్ శేఖర్ రెడ్డి మాజీ డీసీసీబీ డైరెక్టర్, మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడారు.
గత రెండున్నర సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఈ తీర్పు పూర్తిగా ఖండించిందన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలకు, రైతులకు అసలు నిజం తెలిసిందని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం అయినా ఖర్చు సుమారు రూ. 94 వేల కోట్లు అయితే , లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మెడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు అని అందులో 21 పంపు హౌజ్ లు, 15 సబ్ స్టేషన్ లు, రూజర్వాయర్లు, వందల కి. మీ సొరంగాలు, వేల కి. మీ కేనాల్స్, పిల్లకాలువలు, విజయవంతంగా KCR నిర్మించారని గుర్తుచేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగానే SRSP పునరుజీవం (కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ) ప్రాజెక్ట్ నిర్మించారాని అన్నారు.ఈ ప్రాజెక్టు వల్లనే ఇటీవల జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకతీయ కాలువ, వరద కాలువల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిన సందర్భంలో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా కాపాడగలిగామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించగలిగామని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన రివర్స్ పంపింగ్ లేకుంటే వరద కాలువకు నీళ్లు ఎక్కడ నుండి వచ్చేవో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పగలిగుతారా అని ప్రశ్నించారు.
కేవలం కేసీఆర్ గారిని బద్నాం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం చేస్తోందని విమర్శించారురైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు.ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తిరస్కరించడంతో, కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైందని తెలిపారు. ఈ తీర్పును తెలంగాణ రైతాంగ విజయంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్లెడ ఏలీయా, రేగుల్లా రాములు, సత్యం,దయాకర్,రవి,సుంకరి రాములు,మోహన్ దాస్ ,అశోక్, పాల్గొన్నారు.