
పయనించే సూర్యుడు 24 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ టి కే గంగాధర్ కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల దుష్ప్రచారాన్ని తిప్పికొడతం ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ పై అసత్య ఆరోపణలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు క్లీన్ చిట్ - తెలంగాణ రైతాంగం సాధించిన విజయమిది. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ (SRSP పునరుజీవం ) లేకపోతే వరద కాలువలు నీళ్లు వచ్చేవా? రైతుల పక్షాన పోరాటం ఆపేది లేదు, తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే గుణపాఠం తప్పదు. భీంగల్ మండల BRS నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు హరీష్ రావు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి గట్టి చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. భీంగల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో దొనకంటి నర్సయ్య మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడారు. గత రెండున్నర సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఈ తీర్పు పూర్తిగా ఖండించిందన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలకు, రైతులకు అసలు నిజం తెలిసిందని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం అయినా ఖర్చు సుమారు రూ. 94 వేల కోట్లు అయితే , లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మెడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు అని అందులో 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 21 పంపు హౌజ్ లు,19 సబ్ స్టేషన్ లు,203 కి. మీ. సొరంగాలు,98 కి.మీ. ప్రెజర్ మెన్స్.1531కి.మీ.గ్రావిటీ కెనాల్స్.వేల కి. మీ పిల్లకాలువలు, విజయవంతంగా KCR నిర్మించారని గుర్తుచేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగానే SRSP పునరుజీవం (కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ) ప్రాజెక్ట్ నిర్మించారాని అన్నారు.ఈ ప్రాజెక్టు వల్లనే ఇటీవల జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకతీయ కాలువ, వరద కాలువల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిన సందర్భంలో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా కాపాడగలిగామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించ గలిగామని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన రివర్స్ పంపింగ్ లేకుంటే వరద కాలువకు నీళ్లు ఎక్కడ నుండి వచ్చేవో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పగలిగుతారా అని ప్రశ్నించారు. భీంగల్ మండలం లోని కప్పల వాగులు మే నెలలో కూడా రివర్స్ పంపింగ్ ద్వారా వాగులను నింపిన ఘనత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కి దక్కుతుంది. ఈ కప్పల వాగులో కాలేశ్వరం నుండి వచ్చిన నీళ్లు నిలువ ఉండడం వల్ల ఈరోజు భీంగల్ పట్టణంలో త్రాగునీటికి మరియు సాగునీటికి కొదువ లేకుండా ఉన్నది. కేవలం కేసీఆర్ ని బద్నాం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగం చేస్తోందని విమర్శించారు. మేడిగడ్డ వద్ద 84 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయినప్పటికీ, వాటిని మరమ్మతు చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు.
పి సీ ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తిరస్కరించడంతో, కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి చౌటుపల్లి రవి, మాజీ రైతు బంధు అధ్యక్షులు శర్మ నాయక్, మాజీ జిల్లా కోఆప్షన్ మోయీజ్, మాణిక్యాల శ్రీనివాస్,మూడేడ్ల ప్రకాష్, కౌన్సిలర్లు మల్లెల ప్రసాద్,బోదిరే నర్సయ్య, గున్నాల భగత్,నీలం రవి,నాయకులు తోట శంకర్,సతీష్ గౌడ్, పర్సనవీన్,ఎమ్మె సుర్జిల్, బచ్చగొని శ్రీనివాస్, రాజు నాయక్,డిష్ గంగాధర్,లింగం నాయక్, మూత లింబాద్రి, ఎస్పీ ప్రవీణ్,సిద్ధపల్లి రాములు, రాగుల అశోక్, మల్లెల శ్రీకాంత్, తోగిటి అరుణ్, గట్టు రతన్ రాజ్, కైత సాగర్, బోట్ల రామకృష్ణ, లడ్డు, పత్రి దశరథ్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.