సీసీ కెమెరాల దాత కిరణ్ కుమార్ ను పోలీస్ అధికారులు
( పయనించే సూర్యుడు ఆగస్టు 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండలంలోని కాశిరెడ్డి గూడ గ్రామంలో గ్రామ ప్రజలు మరియు యువకుల సహకారంతో ఏర్పరిచిన సిసి కెమెరాల ప్రారంభవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ రెడ్డి ,సీఐ విజయ్ కుమార్,ఎస్ఐ రాజేష్ పాల్గొని సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేర నిరోధనలో మరియు పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర ప్రత్యేకమని, మండలంలోని ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయించిన దాత కిరణ్ కుమార్ ని స్థానిక పోలీస్ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలను మరియు యువకులను తదితరులు అభినందించారు.