
మొక్కలు నాటిన సర్పంచ్ రామలింగం గౌడ్
( పయనించే సూర్యుడు ఆగస్టు 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్ నగర్ మండలం కాశిరెడ్డిగూడెం లో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాశిరెడ్డిగూడెం సర్పంచ్ రామలింగం గౌడ్ ఆధ్వర్యంలో వనమోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి వివిధ రకాల మొక్కలను స్వయంగా నాటడం జరిగింది. మొక్కలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని కాపాడుకోవాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామలింగం గౌడ్ తో పాటు వార్డు సభ్యులు గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు