
( పయనించే సూర్యుడు జూలై 17 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం కాశిరెడ్డిగూడెం లో గురువారం అండర్ డ్రైనేజీ పనులకు గ్రామ సర్పంచ్ రామలింగం గౌడ్ ప్రారంభించారు. దాదాపు 5 లక్షల వ్యాయంతో ఈ అండర్ డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ రామలింగం గౌడ్ మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధి తమ ముఖ్య లక్ష్యం అని కాశిరెడ్డిగూడ గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామపంచాయతీ గా తీర్చిదిద్దుతా అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామలింగం గౌడ్ మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు వార్డు సభ్యులు మాజీ గ్రామపంచాయతీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.