
పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 ముమ్మిడివరం ప్రతినిధి
కిమ్స్ ప్రాంగణం లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు - రంగ రంగ వైభవంగా జరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం - 23 వ తేదీ గురు వారం స్వామి వారి గ్రామోత్సవం జరుగుతుంది. కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో గల శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మూడు రోజుల పాటు జరుగుచున్న ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా రెండవ రోజు అనగా బుధ వారం ఉదయం 5 గంటల నుండి అర్చన, లక్ష్మి హోమం, నీరాజనం మరియు మంత్రపుష్పం, తదుపరి, స్త్రీలచే సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు జరిగాయి. సుమారు 100 మంది మహిళలలు ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము రంగ రంగ వైభవంగా జరిగింది. సుమారు వెయ్యి మంది భక్తులు, పలువురు రాజకీయ నాయకులు మరియు పుర ప్రముఖులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించి తరించారు. తదుపరి తీర్ధ ప్రసాద వితరణ జరిగింది. మూడవ రోజు అనగా 23 వ తేదీ గురు వారం ఉదయం సుదర్శన హోమమం, పూర్ణాహుతి, చక్ర స్నానం తదితర కార్యక్రమాలు జరుగును. మధ్యాహ్నం 3 గంటలకు స్వామి వారి గ్రామోత్సవం జరుగును. సాయంత్రం 5 గంటలకు పర్యంక శయనోత్సవం, ఆశీర్వచనం, పండిత సత్కారం, నీరాజనం, మంత్రపుష్పం మరియు తీర్ధ ప్రసాద వితరణజరుగును.
ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే అని, అమలాపురం పరిసర ప్రాంతముల భక్త మహాశయులందరూ ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని, శ్రీ స్వామి వారి సేవలో తరించవలసినదిగా కిమ్స్ ఛైర్మన్ శ్రీ కె.వి.వి.సత్యనారాయణ (చైతన్య రాజు) తెలిపారు కిమ్స్ ప్రాంగణం లో గల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు
కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో గల శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా మూడవ రోజు గురు వారం ఉదయం సుదర్శన హోమం, పూర్ణాహుతి, చక్ర స్నానం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి . మధ్యాహ్నం 3 గంటలకు స్వామి వారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ గ్రామోత్సవంలో పలువురు భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. సాయంత్రం 5 గంటలకు పర్యంక శయనోత్సవం, ఆశీర్వచనం, పండిత సత్కారం, నీరాజనం, మంత్రపుష్పం మరియు తీర్ధ ప్రసాద వితరణ జరిగాయి.ఈ బ్రహ్మోత్సవాలలో అత్యంత భక్తి శ్రద్దలతో పాల్గొని జయప్రదం చేసిన స్థానిక భక్త జనులను మరియు కిమ్స్ సిబ్బందిని కిమ్స్ ఛైర్మన్ శ్రీ కె.వి.వి.సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) అభినందించారు
