
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్‌ని
జామాబాద్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రమోద్ కుమార్ పి.సి : 1924 అక్టోబర్ 17న మరణించడం జరిగింది. ప్రమోద్ కుమార్ జ్ఞాపకార్ధము పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాల్కొండ యువత ను ప్రోత్సహించే కార్యక్రమం లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఇట్టి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఐపీఎస్.,* హాజరై ముందుగా 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందిన మన సహచరుడు, కానిస్టేబుల్ ప్రమోద్ స్మృతికి అంకితంగా ఈ టెన్నిస్ బాల్ టీ-10, క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించడం అత్యంత గర్వకారణం. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రమోద్ త్యాగం మనందరికీ చిరస్మరణీయం. ఆయన సేవలు, ధైర్యసాహసాలు పోలీస్ విభాగానికి మాత్రమే కాదు , సమాజానికి ఆదర్శప్రాయం.ఈ టోర్నమెంట్ ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తి , క్రమశిక్షణ , ఐక్యత పెంపొందడమే కాకుండా , దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగాలను స్మరించుకునే అవకాశం లభిస్తుంది. క్రీడలు శారీరక దృఢ త్వంతో పాటు మానసిక బలాన్ని పెంచి, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి. నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో మారుమూల గ్రామాలలో యువత డ్రగ్స్ ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం క్రీడలను నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా *సే నో టు డ్రగ్స్ , సే ఎస్ టు స్పోర్ట్స్* అనే నినాదం యువతకు తెలియజేయడం జరిగిందని తెలియజేశారు. మన జిల్లాలో 2020 , 2021 లో జరిగిన కోవిడ్ మరణాల కన్నా గత సంవత్సరం లో జరిగిన రోడ్డు ప్రమాద మృతులు ఎక్కువగా జరిగాయి. దయచేసి ఆందరూ గమనించాలి, రోడ్ భద్రతా నియమాలు పాటించేలా అవగాహనా కల్పించుకొని తాము, తమ కుటుంబ సభ్యులు, తోటి స్నేహితులు, తోటి ఉద్యోగులు, విద్యార్థులు, యువత కంకణం కట్టుకోవాలి. పోలీస్ శాఖ కూడా ప్రజా శ్రేయస్సు దృష్ట్యా గట్టి చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలియజేసారు. గెలుపోటములు సర్వసాధారణమని , ప్రతి ఒక్కరూ క్రీడాకారులు టీం వర్క్ తో ముందు కెళితే విజయము తప్పకుండా సాధించవచ్చని తెలియజేశారు. అనంతరం క్రీడాకారులకు పోలీస్ కమీషనర్ చేతుల మీదుగా ప్రధానం బహుమతుల ప్రధానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్మూర్ ఏ.సీ.పి వెంకటేశ్వరరెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్సై శైలెందర్ , మెండోరా ఎస్సై సుహాసిని, ముప్కల్ ఎస్సై కిరణ్ పాల్, బాల్కొండ ఉపసర్పంచ్ రాజేందర్, బుస్సాపూర్ సర్పంచ్ శ్రీనివాస్ మరియు బాల్కొండ గ్రామ ప్రజలు క్రీడాకారులు, వారి టీమ్ లు పాల్గొనడం జరిగింది.
