
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కాట్రేనికోన
పయనించు సూర్యుడు ఏప్రిల్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులకు మెరుగైన వసతి, దర్శన సౌకర్యాలు కల్పించేందుకు ఆలయాల అభివృద్ధి చేపడుతున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తెలిపారు. కాట్రేనికోన మండల పరిధిలో దక్షిణ కాశీగా పేరుపొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో నిర్మించనున్న వసతి భవనం భక్తులకు విశేష ప్రయోజనం కలిగిస్తుందని మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. అలాగే కోనసీమ జిల్లాలోని పలు ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు, కుండలేశ్వరంలో అన్నదాన భవన నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణ మరియు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు, ఆలయాల పునరుద్ధరణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆధ్యాత్మిక వాతావరణం అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ముందుగా కుండలేశ్వర స్వామిని దర్శించికుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈఓ కొర్లపాటి సత్య వెంకట దుర్గా ప్రధాన అర్చకులు నాగ మల్లేశ్వర రావు, కామేశ్వర రావు ఆధ్వర్యంలో మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆర్ జేసీ త్రినాధ రావు, ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఓగూరి బాగ్యశ్రీ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుత్తుల సాయి, మురమళ్ళ వీరేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు త్సవటపల్లి నాగేంద్ర రావు(నాగు), ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, నాయకులు నడింపల్లి సుబ్బరాజు, త్సవటపల్లి శ్రీనివాస్, గిడ్డి రత్నశ్రీ, విత్తనాల బుజ్జి, గోకరకొండ సత్యనారాయణ, పిఎస్విన్ రాజు, చెల్లి సురేష్, రంభాల రమేష్, మోకా బాల ప్రసాద్ గ్రంథి నానాజీ, కాండ్రేకుల సత్య ప్రసాద్, వంగా దుర్గా బాబు, గంగుమల్ల వీరభద్ర రావు, ఎంపిడిఓ బి. రాజేశ్వరరావు, తహసిల్దార్ రవి కిరణ్, కుండలేశ్వరం గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, సూర్యనారాయణ రాజు, కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ పరిపాలన అధికారిణి సంఘమిత్ర, వివిధ గ్రామాల కూటమి నాయకులు, ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.

