
పయానించే సూర్యుడు ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భక్తులకు సదుపాయలను కల్పించాలి కాట్రేను కోన
దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని అమలాపురం ఆర్డీవో కే మాధవి సూచించారు, బుధవారం ఆలయ ఆవరణలో తహసిల్దార్ రవి కిరణ్ అధ్యక్షతన సమావేశం జరిగిన సమావేశంలో ఆర్ డి ఓ కె మాధవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న మహా శివరాత్రి ఉత్సవాలలో అధికారులు అలసత్వం వహించకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. రెవిన్యూ, పంచాయతీ, మెడికల్ సిబ్బంది మూడు షిఫ్ట్ లలో పనిచేయాలన్నారు, వృద్ధ గౌతమి నదిలో పుష్కర్ ఘాట్ దగ్గర భక్తులు స్నానాలు ఆచరిస్తారని అందుకు పంచాయితీ, విద్యత్ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.తొలుత వీరికి ఆలయ శాఖ తగు
మర్యాదలతో అమలాపురం ఆర్డీవో కే మాధవి ప్రత్యేక దర్శనం అందించి దుశ్శాలవతో సత్కరించారు, ఆలయ ప్రాంగణం, స్నానాల రేపు, భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు వంటి ప్రధాన ప్రాంతాలను ఆమె సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. మహాశివరాత్రి పర్వదినం రోజున కుండలేశ్వర స్వామి వారిని దర్శించు కునేందుకు సుమారు లక్షమంది వరకు భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్డీవో మాధవి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్రమబ ద్ధమైన దర్శన ఏర్పాట్లు, తాగునీటి సదుపా యం. క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక పెట్టాలని సూచించారు. ప్రత్యేకంగా స్నానాల రేవు వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచడంతో పాటు,పడవలను కూడా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచ నలు ఇచ్చారు. ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆలయ పరిసరాలు, రేవు ప్రాంతం, అన్నదానం జరిగే ప్రదేశాల్లో స్వచ్ఛతను కచ్చితంగా పాటిం చాలని అధికారులకు సూచించారు. చెత్త సేకర ణకు ప్రత్యేక బృందాలను నియమించి, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టాఫిక్ నిర్వహణ,వైద్య శిబిరాలు, అత్యవసర సేవలు, పోలీసు బందోబస్తు వంటి అంశాలపై కూడా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆమె అధికారులకు తెలిపారు. భక్తులు సురక్షితంగా, సౌకర్య వంతంగా మహా శివరాత్రి ఉత్సవాలను జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీవో మాధవి స్పష్టం చేశారు. తసిల్దార్ రవి కిరణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు, డీసీ చైర్మన్ ఆకాశం శ్రీనివాస్,మార్గదర్శి త్సవటపల్లి నాగేంద్ర రావు, పి ఎస్ పి ఎస్ఎన్ రాజు (విలేకర్ రాజు) , డి ఎల్ పిఓ పి బొజ్జి రాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, నాయకులు దండ్రుప్రోలు సత్యం బొమ్మిడి లింగేశ్వర రావు , గంగమల్ల వీరభద్ర రావు, ఎంపీడీవో బి రాజేశ్వర రావు,సిఐ ఎం మోహన్ కుమార్, ఎస్ ఐ అవినాష్ ఏఈలు శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం రమేష్, నరహరి, పవన్, వైద్యాధికారి పి నీలిమ, కుండలేశ్వరం దేవస్థానం ఈవో కొర్లపాటి సూర్య వెంకట దుర్గా సొసైటీ చైర్ పర్సన్ గంగమల్ల రవి కుమార్, డిప్యూటీ ఎంపీడీవో సున్న శంకర్ నారాయణ,గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆర్ కే దుర్గా , వీఆర్వో ఓండ్రపు రామకృష్ణ , వీఆర్ఏ సత్యనారాయణ, పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నా
