పయనించే సూర్యుడు, జనవరి 31, ఆదోని రూరల్ రిపోర్టర్
కుప్పగల్ ఎస్.ఎస్.ట్యాంక్ నుండి సరఫరా అవుతున్న పైప్ లైన్ గానేకల్ టర్నింగ్ దగ్గర లీకేజ్ అయి నీరు వృధా అవుతుందని తెలిసి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి సంబంధిత అధికారులకు ఢిల్లీ నుండి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి మరమ్మత్తులు చేయవలసిందిగా ఆదేశించారు.
ఈ సందర్భంగా బిజెపి అధికార ప్రతినిధి ఆదూరి విజయ్ కృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ రోజు కుప్పగల్ స్కీం ఎం.ఎస్. పైప్ లైన్ లీకేజ్ సమస్యను అధికారుల పరిష్కరించారని, ఈ పనులను మండల అధ్యక్షులు వేణుగోపాల్ మరియు కుప్పగల్ బిజెపి నాయకులు దస్తగిరి పర్యవేక్షించారని తెలిపారు. ఈ పైప్ లైన్ మరమ్మతుల కారణంగా కుప్పగల్, పాడేగల్, గనేకల్, బల్లెకల్, జాలిమంచి, కడితోట తదితర గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నా ఆదోని నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ప్రజా సమస్యలు తలెత్తినా తక్షణమే డాక్టర్ పార్థసారథి చర్యలు తీసుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి రమాకాంత్, బిజవైయం మాజీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ ఆచారి, సాయి ప్రసాద్ వాల్మీకి, బిజవైయం నాయకులు శ్రీకాంత్, ఎన్.డి.ఏ. సోషల్ మీడియా వర్కర్ రవి, బిజెపి నాయకులు ముని తదితరులు పాల్గొన్నారు.