
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కుబీర్ మండలంలోని సోమేశ్వర్ తండాలో శ్రీ జగదాంబ సేవాలాల్ దేవాలయానికి సుమారు 22 లక్షల రూపాయలతో మంజూరు జరిగినది. టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ టెండర్ కాపీని తండావాసులకు ఈరోజు అందచేయటం జరిగింది. మంజూరు చేసి టెండర్ పంపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి కి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా నాయక్ ఆడే నజం, ఆలయ అధ్యక్షుడు సురేష్ రాథోడ్, (ఏఎంసి) డైరెక్టర్ అరుణ్, నరేందర్, జాదవ్ తుకారాం, దన్ను,రాథోడ్ శ్యామ్, జాదవ్ రామదాస్,జాదవ్ గజానన్, రాథోడ్ నరేందర్,ఆడే రోహిదాస్, రాథోడ్ జయరాం మరియు తదితరులు ఉన్నారు.