రుద్రూర్, జూలై 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ గ్రామ చెరువు నిండిపోయి జలకళ నెలకొంది. కురుస్తున్న వర్షాలకు చెరువులోకి నీరు చేరడంతో గ్రామంలోని అంబం గల్లీ వద్ద ఉన్న గాడిలు నీటి ప్రవాహంతో పొంగిపొర్లుతున్నాయి. అదేవిధంగా కురుస్తున్న వర్షాలకు కుంటలు, వాగులు నిండిపోయాయి. వర్షాలు కురవడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.