పయనించే సూర్యుడు మార్చి 3 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రం లో చేపట్టిన కుల గణన సర్వే వైఫల్యానికి కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యతని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం బీసీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు తెల్ల హరికృష్ణ అన్నారు. గతంలో పాల్గొనని 3.56 లక్షల కుటుంబాల కోసం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు నిర్వహించిన బీసీ కుల గణన సర్వేలో ఎంత మంది పాల్గొన్నారో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సోమవారం కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీ లోని వారి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కొట్టే వేణు, రాహుల్ తేజ, తెల్ల చంద్రశేఖర్, దండే శ్రీకాంత్, కొట్టే మహేష్, వీరు, నర్సింగ్, శ్రీనివాస్ తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఈ విధంగా చర్చించుకొని మాట్లాడడం జరిగింది, కుల గణన సర్వేపై విస్తృత ప్రచారం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు సర్వే దరఖాస్తు ఫారాలు హోటల్ లో పేపర్ ప్లేట్లుగా, ప్రభుత్వ కార్యాలయంలో చిత్తు కాగితాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.*