పయనించేసూర్యుడు ఏప్రిల్ 22 అన్నమయ్య జిల్లా సుండు పల్లెమండలం
అరబ్ దేశమైన కువైట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలను రాత్రి ఘనంగా జరుపుకున్నట్లు ఎన్నారై సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామం కందుల వాళ్ళ పల్లెకు చెందిన కుంచన రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయని తెలిపారు కువైట్ లోని హావల్లి ప్రాంతంలో ఎన్నారైలు తెలుగుదేశం పార్టీ అభిమానులు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరారు అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు సహదేవ, గోవిందు, ఆనంద్, సాయి, కుంపటి నాగరాజ, కుంచ నగేష్, గుగ్గిళ్ళ నాగార్జున, బెంగుళూరు బ్రహ్మయ్య, బలరాం, మల్లికార్జున, మూర్తి, మధుసూదన్,విశ్వేశ్వర పలువురు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు